శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (17:33 IST)

12వ రోజూ పెరిగిన పెట్రో ధర

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 12వ రోజైన గురువారం కూడా పెరిగాయి. జూన్‌ 6న మొదలైన ధరల పెంపు ప్రతీ రోజూ కొనసాగుతూనే ఉంది.

ఇదే తీరులో కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ. 100 కూడా దాటేయవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పెట్రోలుపై 46-53 పైసలు, డీజిల్‌పై 54-64 పైసలు పెరిగింది. ఇప్పటివరకు పెట్రోలు ధర లీటరుకు 6 రూపాయల 55 పైసలు, డీజిల్‌ ధర 7 రూపాయల 4 పైసలు చొప్పున పెరిగింది.

దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ. 77.81 కాగా, డీజిల్‌ ధర రూ. 76.43గా నమోదైంది. అలాగే ముంబయి, చెన్నైల్లో వరుసగా, పెట్రోల్‌ ధర రూ.84.66, 81.32 కాగా, డీజిల్‌ ధర రూ. 74.93, 74.23గా నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.80.77, డీజిల్‌ ధర రూ.74.70 కాగా, అమరావతిలో పెట్రోలు ధర రూ. 81.99 డీజిల్‌ రూ.75.14గా నమోదైంది.