శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 డిశెంబరు 2016 (14:03 IST)

'అమ్మ' పార్థీవ దేహానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అశ్రు నివాళి... శశికళకు ఓదార్పు

తమిళనాడు ప్రజలను శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ముఖ్యమంత్రి జయలలిత భౌతిక కాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మంగళవారం నాడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు క

తమిళనాడు ప్రజలను శోక సంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన ముఖ్యమంత్రి జయలలిత భౌతిక కాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మంగళవారం నాడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న ప్రధాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కడసారి వీడ్కోలు పలికారు. జయ భౌతిక కాయాన్ని చూసి ఆయన కళ్లు చమర్చాయి.
 
ప్రధానమంత్రి మోదీ వెంట కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావులు ఉన్నారు. కొత్తగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళలను మోదీ ఓదార్చారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు.