సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (16:22 IST)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు దోచుకున్న గ్రామమేదీ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసును ఓ గ్రామవాసులు దోచుకున్నారు. తమ గ్రామంలో టాయిలెట్లను నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులను తీసుకోకుండా, గ్రామస్థులు ఎవరికి వారే సొంత డబ్బుతో మరుగుదొడ్లు కట్టించుకున్నా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసును ఓ గ్రామవాసులు దోచుకున్నారు. తమ గ్రామంలో టాయిలెట్లను నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులను తీసుకోకుండా, గ్రామస్థులు ఎవరికి వారే సొంత డబ్బుతో మరుగుదొడ్లు కట్టించుకున్నారు. ఆ గ్రామం పేరు బిజ్నూర్. దీనిపై ప్రధాని స్పందించారు. ఈ గ్రామ వాసులు తన మనసును దోచుకున్నారంటూ ప్రశంసించారు. 
 
ఆకాశవాణి మాధ్యమంగా తన 33వ 'మన్ కీ బాత్' ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ, రంజాన్ పర్వదినం జరుపుకోవడానికి సిద్ధమైన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛ భారత్‌ కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఉద్యమం, ప్రజల్లోకి వెళ్లిందన్నారు. 
 
ఎమర్జెన్సీ సమయాన్ని గురించి ప్రస్తావించిన మోడీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రచించిన ఓ పద్యాన్ని గుర్తు చేసుకున్నారు. దేశంలోని అత్యయిక స్థితి, ప్రజలను ఏకతాటిపై నడిపించి, ప్రజాస్వామ్య విలువలను పెంచిందని తెలిపారు. 
 
తనకు అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ అనిల్ సోనారా నుంచి ఓ విలువైన సలహా వచ్చిందని, ఎవరైనా ఎవరికైనా బహుమతులు ఇవ్వాలంటే మంచి పుస్తకాలను ఇచ్చేలా తన నోటి నుంచి సలహా ఇవ్వాలని ఆయన కోరారని ఆ ప్రకారంగానే తాను దేశ ప్రజలందరికీ సూచన చేస్తున్నట్టు చెప్పారు.