శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:59 IST)

పీవోకే పాకిస్థాన్‌‍కే సొంతం.. ఫరూఖ్ అబ్ధుల్లా

జమ్మూకాశ్మీర్ భారత్‌లో భాగమని, అయితే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) పాకిస్థాన్‌లో అంతర్భాగమని కేంద్ర మాజీ మంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్ధుల్లా అన్నారు. పీవోకే పాకిస్థాన్‌‍కే సొంతమని ఫరూఖ్ స్పష్టం చేశారు. తమ పార్టీ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. స్వయం ప్రతిపత్తి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి కేంద్ర ప్రభుత్వం కాదని, కాశ్మీర్ ప్రజలని అబ్ధుల్లా వెల్లడించారు. 
 
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు కాశ్మీర్‌కు ఎంతో ముఖ్యమని.. సత్సంబంధాలు ప్రారంభమైతే ఏళ్లుగా నలుగుతున్న కాశ్మీర్ సమస్య దానంతట అదే పరిష్కారమవుతుందని అబ్ధుల్లా తెలిపారు. కర్తార్‌పూర్ కారిడార్ పనుల నేపథ్యంలో పీవోకేలోని శారదాపీఠం ఆలయాన్ని కాశ్మీర్ పండిట్ల కోసం తెరవాలనే డిమాండ్‌కు ఫరూఖ్ మద్దతు పలికారు.