గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (16:20 IST)

ఎయిమ్స్‌కు రాష్ట్రపతి కోవింద్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎయిమ్స్‌కు తరలించనున్నట్లు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు తరలిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఛాతీలో నొప్పి కారణంగా శుక్రవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. సాధారణ వైద్యపరీక్షలు నిర్వహించి అబ్జర్వేషన్‌లో ఉంచామని అన్నారు.

కాగా, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. తను క్షేమంగా ఉండాలని ప్రార్థించిన వారికి కోవింద్‌ ట్విటర్‌లో  కృతజ్ఞతలు  తెలిపారు.