శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 8 మార్చి 2017 (04:28 IST)

గంగామాత పిలిచింది.. అందుకే ఢిల్లీవదిలి కాశీకి వచ్చా అంటున్న మోదీ

భారత రాజకీయ చరిత్రలో ఒక అసెంబ్లీ ఎన్నికలకు తన స్థాయిని కూడా మర్చిపోయి ఇంత భీషణ ప్రచారంలో మునిగితేలుతున్న ప్రధానిని ఇంతవరకు ఎవరూ చూడలేదు. దేశప్రధానిగా, 125 కోట్లమంది భారతీయుల ప్రతినిధిగా ఉంటున్న మోదీ గత మూడు రోజులుగా రాత్రింబవళ్లు తన సొంత నియోజక వర్గమ

భారత రాజకీయ చరిత్రలో ఒక అసెంబ్లీ ఎన్నికలకు తన స్థాయిని కూడా మర్చిపోయి ఇంత భీషణ ప్రచారంలో మునిగితేలుతున్న ప్రధానిని ఇంతవరకు ఎవరూ చూడలేదు. దేశప్రధానిగా, 125 కోట్లమంది భారతీయుల ప్రతినిధిగా ఉంటున్న మోదీ గత మూడు రోజులుగా రాత్రింబవళ్లు తన సొంత నియోజక వర్గమైన వారణాసిలోనే మకాం వేయడం చూస్తున్నవారికి షాక్ కలిగిస్తోంది. గతంలో ఇంత సుదీర్ఘంగా రాష్ట్రాల ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని లేరు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్‌ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రధాని హోదాను పక్కనబెట్టి స్థానిక అభ్యర్థి తరహాలో తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో దూకుడుగా ప్రచారం చేశారు. వారణాసిని యుద్ధరంగంగా మార్చేశారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఆయన సభలకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ... 125 కోట్ల మంది భారతీయుల ప్రతినిధి. క్షణం తీరిక ఉండని పదవి. కాలికి బలపం కట్టుకొని ప్రపంచమంతా తిరిగే అలవాటు. ఇండియాలో ఉంటే ఒక్క రోజులోనే దేశం నాలుగు మూలలా తిరిగి రాత్రికి ఢిల్లీచేరుకోవడం ఆయనకు రొటీన్‌! అలాంటి నేతను ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి మూడు రోజులపాటు కట్టి పడేసింది. అనూహ్యంగా ఆయన 4, 5, 6 తేదీల్లో మూడు పగళ్లు, రెండు రాత్రులు తన సొంత నియోజకవర్గం వారణాసిలోనే మకాం వేశారు. నగరం చుట్టూ ఉన్న ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ప్రధాని అయ్యాక ఆయన ఇంత సుదీర్ఘ సమయం ఒకేచోట గడపటం ఇదే ప్రథమం! యూపీ రాష్ట్రమంతటా ఆయన అఖిలేశ్‌, రాహుల్‌ల కన్నా ఎక్కువ సభల్లో ప్రసంగించారు.
 
గతంలో ఇంత సుదీర్ఘంగా రాష్ట్రాల ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని లేరు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్‌ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రధాని హోదాను పక్కనబెట్టి స్థానిక అభ్యర్థి తరహాలో తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో దూకుడుగా ప్రచారం చేశారు. వారణాసిని యుద్ధరంగంగా మార్చేశారు. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ఆయన సభలకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించారు. అదే సమయంలో అఖిలేశ్‌, రాహుల్‌ కూడా వారణాసిలో ప్రచారం చేసినా అవి మోదీ సభల ముందు వెలవెలబోయాయి. 
 
తూర్పు యూపీకి కేంద్ర బిందువు వారణాసి. పూర్వాంచల్‌కు గుండెకాయ. యూపీ అంతా గెలవటమొక ఎత్తయితే వారణాసిలో గెలుపొందటం మరొక ఎత్తు. రాష్ట్రమంతా గెలిచి వారణాసిలో ఓడితే చెడ్డపేరు మోదీ భరించాల్సి వస్తుంది. మచ్చగా మిగిలిపోతుంది. అందుకే మూడు రోజులు మకాం వేశారు. ఆర్‌ఎ్‌సఎస్‌ బృందంతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. 
 
రెండున్నరేళ్లుగా ప్రధాని నియోజకవర్గం వారణాసిలో అభివృద్ధి కనిపించటం లేదు. స్థానిక ప్రభుత్వాలు సహకరించకపోవటం వల్లే ఏమీ చేయలేకపోయానని ఆయన చెబుతున్నారు. వారణాసికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, గంగానదిలో ఘాట్ల అభివృద్ధి హామీలు అమలు కాలేదు. రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు. మోదీ లక్ష్యం వారణాసి పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ గెలుపొందడం. అదేమంత సులభంగా కనిపించటం లేదు. నేతలంతా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. భారం మోదీపై వేశారు. మోదీ కష్టం ఫలిస్తుందా లేదా అన్నది నాలుగు రోజుల్లో తేలనుంది.
 
ప్రస్తుతం యూపీలో హోరాహోరీ నడుస్తోంది. గెలుపోటముల్లో చివరిదశ 40 సీట్ల ప్రభావం తప్పకుండా ఉంటుంది. మోదీ ఆలోచన యూపీ ఎన్నికల వరకే పరిమితం కాలేదు. ఈ ఉద్ధృత ప్రచారం ప్రభావం తూర్పు యూపీలో 2019 ఎన్నికల్లో కూడా ఉండాలని అనుకున్నారు. అందుకే ప్రధానిగా ఊపిరి సలపని పనులున్నా యూపీ ప్రచారం చివరి మూడు రోజులు వారణాసికి వచ్చి కూర్చున్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానులు ఆసక్తి చూపరు. ప్రచారానికి వెళ్లినా 2-3 సభల్లో పాల్గొంటారు. మోదీ మాత్రం వారణాసిలోని ప్రతి వీధిలోనూ తిరిగారు. గంగామాత తనను పిలిచిందని, వారణాసి తన కర్మభూమని ప్రకటించారు.