శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (09:36 IST)

కోవిడ్ బారినుంచి కోలుకున్న తర్వాత పాటించాల్సిన పద్ధతులు

కోవిడ్-19 బారినపడి కోలుకుంటున్న వారు కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

కోవిడ్-19‌ నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు ఒంటి నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు కనపడతాయని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది.

ఈ నేపథ్యంలో కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలోని అనస్థీషియాలజీ మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ వైద్యులు కూడా కోవిడ్ బారి నుంచి బయటపడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
 
1. వ్యక్తిగతంగా:
* కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా మాస్కు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శ్వాసకోస జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
 
* తగినంత మేరకు వేడి నీళ్లు తాగుతూ ఉండాలి  
 
* రోగనిరోధ శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించిన మందులను వాడండి. ఆయుష్ డాక్టర్ ఇచ్చిన మందులు మాత్రమే ఉపయోగించండి.
 
* మీ ఆరోగ్యం సహకరిస్తే ఇంట్లో రోజువారీ పనులను చేసుకోండి. వృత్తిపరమైన పనులను కూడా క్రమపద్దతిలో ప్రారంభించవచ్చు. 
 
2) తేలికపాటి/ మితమైన వ్యాయామాలు:
 
* శరీరం సహకరించిన మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగాసనాలను వేయడం, ప్రాణాయామం చేయడం వంటి చర్యలను రోజూ చేయాల్సి ఉంటుంది.
 
* చికిత్స చేసే వైద్యులు సూచించిన విధంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి.
 
* మీకు సౌకర్యంగా ఉండే చోట ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నడవడం అలవాటు చేసుకోండి.
 
*  సమతుల్యమైన పోషకాహారం, తాజాగా వండిన, సులువుగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
 
* తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవాలి.
 
* పొగతాగడం, మద్యం సేవించడాన్ని మానేయండి.
 
* కోవిడ్ చికిత్స సమయంలో సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఒకవేళ ఏమైనా శ్వాసకోస సంబంధమైన ఇబ్బందులు ఉంటే వెంటనే మీకు తెలిసిన వైద్యులను సంప్రదించాలి. వ్యక్తిగతంగా ఏమైనా మందులు వాడుతున్నట్టయితే వైద్యులకు తెలియజేయాలి. వారు సూచించిన మందులను వాడాలి.
 
* ఇంట్లోనే ఉంటూ శరీర ఉష్ణోగ్రతను తరచూ పరీక్షించుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆక్సోమీటర్ తో ఆక్సిజన్ లెవల్స్ ను తెలసుకుంటూ ఉండాలి. 
 
* పొడి దగ్గు / గొంతు నొప్పి ఉంటే, సెలైన్ గార్గల్స్ లేదా ఆవిరి పట్టడం చేసుకోండి.  
 
* కోవిడ్ ముందస్తు లక్షణాలైన తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ లెవెల్స్ 95శాతం కంటే తక్కువగా ఉండడం, ఛాతిలో నొప్పి, శరీరం బలహీనంగా మారడం, గందరగోళ పరిస్థితులు వంటివి
 
3) కమ్యునిటీల స్థాయిలో:
* కోవిడ్ నుంచి కోలుకున్నవారు ఆ సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా గానీ, సంఘాలని గానీ, నాయకుల ద్వారా గానీ, కుల సంఘాల పెద్దల ద్వారా తమ స్నేహితులు, బంధువులతో పంచుకోవడం ద్వారా కోవిడ్ పై అవగాహన, వైరస్ పై ఉన్న వదంతులు తొలగించవచ్చు.
 
* స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, పౌరసమాజం, పలువురు నిపుణులతో పునరావాస చర్యలు చేపట్టండి (వైద్య, సామాజిక, వృత్తిపరమైన, జీవనోపాధి)
 
* సహచరులు, ఆరోగ్య కార్యకర్తల నుంచి సామాజిక మద్దతు కోరండి. అవసరమైతే మానసిక ఆరోగ్యసాయం తీసుకోండి.
 
* పలు సంస్థలు, గ్రూపులు నిర్వహించే యోగా, ధ్యానం లాంటి సమూహ సమావేశాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనండి. 
 
4) ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం:
* కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తికి భౌతికంగాను లేదా ఫోన్ ద్వారా 7 రోజుల్లోపు సంప్రదించాలి. వీలైనంత వరకు అతను చికిత్స పొందిన ఆస్పత్రిలో అయితే మంచిది.
 
* దగ్గరలో ఉన్న గుర్తింపు పొందిన అల్లోపతి లేదా ఆయుష్ ప్రాక్టీషనర్, మెడికల్ ఫెసిలిటీలు ఉన్న వారు తరచూ వారిని పరీక్షించడం, ఫాలో అప్ చేస్తూ ఉండాలి. పాలిథెరపీని వీలైనంత వరకు నివారించాలి.
 
* ఒకవేళ హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నవారైతే ఏవైనా కోవిడ్ లక్షణాలున్నట్టు గుర్తిస్తే వెంటనే వైద్యులకు గానీ, స్థానికంగా ఉండే ఆస్పత్రికి గానీ వెళ్లాలి. 
 
* క్లిష్టమైన, తీవ్రమైన కేసులకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకుంటూ సరైన విధంగా డాక్టర్లను సంప్రదిస్తూ ఫాలోఅప్ చేసుకోవాలి.
 
కరోనా బారిన పడి ఆరోగ్యవంతులు అయిన తర్వాత కూడా, కరోనా తిరిగి రావటానికి అవకాశం ఉంది రెండోసారి వచ్చినట్లయితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.

కనుక కరోనా పై న విజయం సాధించాను యాంటీబాడీస్ నా బాడీలో ఉన్నాయి అని అజాగ్రత్తతో ఉన్నట్లయితే కరోనా తీవ్రస్థాయిలో తిరగబెట్టే అవకాశాలు ఉన్నవి అన్న వైద్యుల  అభిప్రాయాలను గమనిస్తూ పై జాగ్రత్తలు తీసుకోవలసినదిగా ప్రభుత్వం వారు సూచిస్తున్నారు.