1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (10:38 IST)

ఇద్దరు టెక్కీ మృతికి కారణమైన వ్యక్తికి గంటల వ్యవధిలో బెయిలా? వెనక్కి తగ్గిన జువైనల్ బోర్డు!!

court
పీకల వరకు మద్యం సేవించి, కన్నూమిన్నూ తెలియకుండా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మృతికి కారణమైన ఓ 14 యేళ్ల బాలుడికి అరెస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలో జువైనల్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. దీంతో కోర్టు వెనక్కి తగ్గింది. ఆ బాలుడికి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసూత తాజాగా తీర్పును వెలువరిస్తూ, వచ్చే నెల ఐదో తేదీ వరకు రిమాండ్ విధించింది. అలాగే, బాలుడికి కారు ఇచ్చిన అతడి తండ్రికి కూడా ఈ నెల 24వ తేదీ వరకు కస్టడీ విధించింది. 
 
ఇటీవల మహారాష్ట్రలో 17 యేళ్ల బాలుడు పీకల వరకు మద్యం సేవించి కారు నడిపి, ఇద్దరి మృతికి కారణమయ్యాడు. తాగినమత్తులో కన్ను మిన్నుకానక 160 కిలోమీటర్ల వేగంతో కారు నడిపాడు. దీంతో కారు నియంత్రణ కోల్పోయి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై దూసుకెళ్లడంతో వారు మృత్యువాతపడ్డారు. అలా ఇద్దరి మృతికి కారణమైన బాలుడికి జువైనల్ బోర్డు 14 గంటల వ్యవధిలోనే పూణె బెయిల్ మంజూరు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 
 
ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మరణానికి కారణమైన వ్యక్తికి గంటల వ్యవధిలోనే బెయిలా? అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బాలుడి బెయిలును రద్దు చేస్తూ తాజాగా తీర్పు వెలువరిస్తూ జూన్ 5వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అలాగే, బాలుడికి కారు ఇచ్చిన అతడి తండ్రిని రెండు రోజుల (24 వరకు) పోలీస్ కస్టడీకి పంపింది.
 
మరోవైపు, నిందితుడైన బాలుడి తాత సురేంద్ర కుమార్ అగర్వాల్‌కు అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌తో సంబంధాలు ఉన్నట్టు వార్తలు రావడంతో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇంకోవైపు, బాలుడి నేరం అతిపెద్దది కావడంతో అతడిని మేజర్ పరిగణించాలంటూ పూణె పోలీసులు కోర్టులో రివ్యూ దాఖలు చేశారు.