గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (16:45 IST)

న్యాయం చేయమని స్టేషన్‌కు వస్తే పడక సుఖం ఇవ్వమన్న డీఎస్పీ.. ఎక్కడ?

ఓ మహిళ అత్తమామల వేధింపులు భరించలేక న్యాయం కోసం స్టేషన్‌కు వస్తే తనకు పడక సుఖం ఇవ్వాలంటూ ఓ ఖాకీ కామాంధుడు కోరాడు. దీంతో ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక జిల్లా ఎస్పీతో పాటు.. మీడియాను ఆశ్రయించడంతో ఆ ఖాకీ

ఓ మహిళ అత్తమామల వేధింపులు భరించలేక న్యాయం కోసం స్టేషన్‌కు వస్తే తనకు పడక సుఖం ఇవ్వాలంటూ ఓ ఖాకీ కామాంధుడు కోరాడు. దీంతో ఆమె ఎవరికి చెప్పుకోవాలో తెలియక జిల్లా ఎస్పీతో పాటు.. మీడియాను ఆశ్రయించడంతో ఆ ఖాకీ ప్రబుద్ధుడి నిజస్వరూపం బయటపడింది. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పంజాబ్ రాష్ట్రంలోని భటిండా పట్టణానికి చెందిన ఓ మహిళకు అత్తమామల వేధింపులతో గర్భస్రావమైంది. దీంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. అయితే, ఆ వివాహిత నిస్సహాయస్థితిని అవకాశంగా తీసుకున్న డీఎస్పీ హరీందర్ సింగ్‌ తన కోర్కె తీర్చుకోవాలని ఆశపడ్డాడు. 
 
దీంతో సదరు వివాహిత నేరుగా జిల్లా ఎస్పీని కలిసింది. అత్తమామలతో రాజీపడమని చెప్పడమేకాకుండా సదరు డీఎస్పీ తనను ఒంటరిగా రమ్మని చెప్పి లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ హరీందర్ సింగ్‌పై విచారణకు జిల్లా ఎస్పీ ఆదేశించగా, ఈ విచారణలో నిజంగానే డీఎస్పీ వివాహితను లైంగికంగా వేధించాడని ప్రాథమిక విచారణలో తేలడంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 354, 354 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.