గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (14:41 IST)

కొండ చిలువ మేకను మింగేసింది.. ఆపై ఏం చేసిందంటే? (video)

సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్య కొండ చిలువలు తీసుకునే ఆహారంపై పలు వీడియోలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటికి మొన్న కొండ చిలువ మనిషిని మింగేసింది. ఆ వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తూ.. కొండ చిలువ కడుపులో ఆతని మ

సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్య కొండ చిలువలు తీసుకునే ఆహారంపై పలు వీడియోలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటికి మొన్న కొండ చిలువ మనిషిని మింగేసింది. ఆ వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తూ.. కొండ చిలువ కడుపులో ఆతని మృత దేహాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఓ కొండ చిలువ మేకను మింగి జీర్ణం చేసుకునేందుకు నానా తంటాలు పడింది. 
 
తన నోటికి చిక్కిన మేకను దొరికిందే అదనుగా కొండ చిలువ అమాంతం మింగేసింది. ఆకలి తీర్చుకుందామనుకుంది కానీ, దాని అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎటూ కదల్లేక అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
అసోంలోని బైహత చైరైలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు గమనించి దాని మెడకు తాడేసి బంధించారు. ఆపై అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దారు దాన్ని ఓ వాహనంలో తీసుకెళ్లి సమీపంలోని అడవుల్లో విడిచిపెట్టారు.