రజనీకాంత్ నిరక్ష్యరాస్యుడు, ఫైనాన్షియల్ ఫ్రాడ్.. అంతా మీడియా హైపే: సుబ్రహ్మణ్య స్వామి
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు రజనీకాంత్ ఏమాత్రం సరిపోడని, ఆయన నిరక్ష్యరాస్యుడని తీవ్ర పదజాలంతో వ్యా
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు రజనీకాంత్ ఏమాత్రం సరిపోడని, ఆయన నిరక్ష్యరాస్యుడని తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. రజనీకాంత్ సొంత పార్టీ పెట్టనున్నారని, ఎన్డీయేకు మద్దతుగా ఉంటారని ఆయన సన్నిహితుడు గురుమూర్తి చెప్పిన సంగతి తెలిసిందే.
రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఖరారవుతున్న నేపథ్యంలో.. గురుమూర్తి రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. కొత్త పార్టీ పెడతారని, రజనీ రాకతో చిన్న పార్టీలన్నీ కనుమరుగు అవుతాయని చెప్పారు. అంతేగాకుండా రజనీకాంత్ ఎన్డీయే వెంటే ఉంటారని గురుమూర్తి తెలిపారు. కాగా రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని కొన్నేళ్లుగా అభిమానులు, పార్టీలకతీతంగా నాయకులు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం గత లోక్ సభ ఎన్నికల సమయంలో చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు.
అయితే రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ తన మనసులోని మాటను ఎప్పుడూ బయటపెట్టలేదు. అయితే ఇటీవల అభిమానులతో భేటీ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చేందుకే రజనీ ఫ్యాన్స్‌తో భేటీ అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే డిసెంబరు 12 రజనీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త పార్టీ పెడతారని సమాచారం. అయితే రజనీకాంత్ నిరక్ష్యరాస్యుడని.. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటూ స్వామి చేసిన కామెంట్స్ ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. మీడియా హైప్ తోనే రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చర్చ సాగుతోందని స్వామి వ్యాఖ్యానించారు.