1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 ఆగస్టు 2016 (19:20 IST)

పాకిస్థాన్‌కు వెళ్లింది విందు కోసం కాదు : హోంమంత్రి రాజ్‌నాథ్

తాను పాకిస్థాన్‌కు వెళ్లింది విందు కోసం కాదనీ సార్క్ సదస్సులో పాల్గొనేందుకు మాత్రమేనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన సార్క్ సదస్సు కోసం ఆయన ఇటీవల పాకిస్

తాను పాకిస్థాన్‌కు వెళ్లింది విందు కోసం కాదనీ సార్క్ సదస్సులో పాల్గొనేందుకు మాత్రమేనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన సార్క్ సదస్సు కోసం ఆయన ఇటీవల పాకిస్థాన్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ను పాక్ హోం మంత్రి విందుకు ఆహ్వానించినట్టుగా ఆహ్వానించి ఆయన మాయమైపోయారు. 
 
ఈ నేపథ్యంలో తన సార్క్ సదస్సు పర్యటన వివరాలను ఆయన శుక్రవారం లోక్‌సభకు వివరించారు. తాను పాకిస్థాన్‌కు వెళ్లింది సార్క్ సదస్సులో పాల్గొనడానికని, విందుకు కాదని స్పష్టం చేశారు. తనను విందుకు పిలిచిన పాక్ హోం మంత్రి అక్కడ నుంచి వెంటనే మాయమయ్యారని, వారి అంతరంగం గుర్తించే తాను విందుకు హాజరు కాలేదన్నారు. 
 
తాను పాకిస్థాన్‌లో అడుగుపెట్టినప్పటి నుంచీ అడుగడుగునా ఆందోళనలు వెల్లువెత్తాయని, అయితే తాను వీటికి వెరవలేదన్నారు. ఆందోళనల గురించి పట్టించుకుంటే పాకిస్థాన్‌కే వెళ్లేవాణ్ణి కాదన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు రాజ్యసభలో రాజ్‌నాథ్‌ను శెభాష్ అంటూ మెచ్చుకున్నాయి. సార్క్ సదస్సులో భారత వాణిని గట్టిగా వినిపించారని కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ కీర్తించాయి. తనకు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలకు రాజ్‌నాథ్ ధన్యవాదాలు తెలిపారు.