గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (11:22 IST)

న్యాయవాద వృత్తికి క్రిమినల్ లాయర్ గుడ్‌బై...

ఏడు పదుల న్యాయవాద వృత్తికి ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ స్వస్తి చెప్పారు. మరో వారం రోజుల్లో 95వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం

ఏడు పదుల న్యాయవాద వృత్తికి ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ స్వస్తి చెప్పారు. మరో వారం రోజుల్లో 95వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆయనను సన్మానించారు. 
 
ఈ సందర్భంగా రామ్‌జఠ్మలానీ తన పదవీ విరమణను ప్రకటించారు. ఈ వారం ప్రారంభంలో ఓ కేసు విచారణ సందర్భంగా ఇది తన చివరి కేసు అని, ఇకపై తాను ఎలాంటి కేసులు వాదించబోనని జఠ్మలానీ సుప్రీంకోర్టుకు తెలిపారు. జఠ్మలానీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు.. ఆయన ఏడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రముఖమైన కేసులు ఎన్నింటినో వాదించారు. 
 
సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లో అత్యధిక ఫీజు తీసుకునే న్యాయవాది. న్యాయవాద వృత్తి నుంచి తప్పుకుంటున్నా.. ప్రజాజీవితం నుంచి బయటకు వెళ్లడంలేదని ఆయన ప్రకటించారు. నేను జీవించి ఉన్నంతకాలం రాజకీయాల్లో అవినీతిపై పోరాడుతాను. భారతదేశాన్ని శక్తిమంతమైన, మంచి స్వరూపంలోకి తీసుకొని వస్తానని నమ్ముతున్నాను అని జఠ్మలానీ పేర్కొన్నారు.