మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (12:55 IST)

ఆకాశంలో అరుదైన బ్లూ మూన్.. రాఖీపూర్ణిమ నాడు అరుదైన విశ్వరూపం

Blue Moon
ఆకాశంలో అరుదైన బ్లూ మూన్ తేలనుంది. రాఖీపూర్ణిమ నాడు ప్రపంచం ఓ అరుదైన విశ్వరూపం చూడనుంది. ఆకాశంలో అరుదైన సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది. బ్లూ మూన్, సూపర్ మూన్ జతలు చాలా అరుదు. 
 
సుమారు 10 నుండి 20 సంవత్సరాల తరువాత, చంద్రుని క్షణం వస్తుంది. ప్రతి రెండు నుండి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సూపర్‌మూన్‌లు సంభవిస్తాయి. బుధవారం రాత్రి 8 గంటలకు సూపర్ బ్లూ మూన్‌ను ప్రపంచం చూడవచ్చు. 
 
తదుపరి సూపర్ బ్లూ మూన్ జనవరి, మార్చి 2037లో కనిపిస్తుంది. ఫుల్ మూన్ సమయంలో జాబిల్లి కక్ష్య భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది.
 
చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరిగే క్రమంలో చంద్రుడు కొన్ని సార్లు భూమికి తక్కువ దూరంలో ఉంటాడు దీన్ని పెరజీ అని, దూరంగా పాయింట్‌ను అపోజీగా పేర్కొంటారు.