శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (12:57 IST)

రెండు తలల పాము.. నేలపై నెమ్మదిగా కదులుతూ..

snake
భువనేశ్వర్‌లో రెండు తలల పాము కనిపించింది. తలలు రెండు ఉన్నా శరీరం మాత్రం ఈ పాముకు ఒకటే ఉంటుంది. దీన్ని ఉల్ఫ్ స్నేక్ అంటారు. ఒడిశాలోని కియోంజార్‌లో నివాసముంటున్న ఓ ఇంట్లో ఈ పాము కనిపించింది. రెండు తలల బరువు వల్ల అది నేలపై నెమ్మదిగా కదులుతోంది. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు ఆ ఇంటికి చేరుకుని పామును పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
 
దీనికి సంబంధించిన వీడియోను అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీన్ని చూసిన నెటిజన్లు అరుదైన పామును చంపకుండా వదిలేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దాన్ని రక్షించడమే కాక తిరిగి తల్లి లాంటి అడవి ఒడిలోకి చేర్చడం నిజంగా గొప్ప విషయమంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఈ రెండు తలల పామును చూశామని ఆశ్చర్యపోతున్నారు.