శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (18:38 IST)

సర్టిఫికేట్లు మిస్సైతే బాధపడనక్కర్లేదు.. నవీన్ పట్నాయక్

సర్టిఫికేట్లు మిస్సైతే ఒరిస్సా ప్రజలు ఇక బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే? అక్కడి ప్రభుత్వం ఈ సర్టిఫికెట్ కార్యక్రమం అమల్లోకి తెచ్చింది. ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా తగిన సమయంలో ప్రజలకు అందించే లక్ష్యంతోనే.. ఈ పథకం ప్రవేశపెట్టినట్టు నవీన్ పట్నాయక్ తెలిపారు. భూ లావాదేవీలను నిర్వహించడానికి పౌతీ అనే చెల్లింపు సేవల యాప్‌ను కూడా నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.
 
ఎలాగంటే...  ఇక అక్కడ ఆదాయం, నివాసం లాంటి అధికారిక ధ్రువపత్రాలను ప్రజలకు ఉచితంగా అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ పథకం ప్రారంభించింది. దీని ద్వారా కుల, ఆదాయం, నివాసం లాంటి ప్రభుత్వ ధ్రువపత్రాల కోసం ప్రజలు ఆన్‌లైన్ లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
నమూనా పరిపాలనలో భాగంగా.. ఈ పథకాన్ని ప్రవేశబెట్టామంటున్నారు ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్. దేశంలో ఈ తరహా విధానం ఇదే తొలిసారని పట్నాయక్ వెల్లడించారు.  ఈ సర్టిఫికేట్ పథకం ద్వారా 50లక్షలకు పైగా ప్రజలు లబ్దిపొందుతారని వివరించారు.