శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (11:16 IST)

బుల్ బుల్ అంటూ మహా తుఫాన్ వచ్చేస్తోంది..

బుల్ బుల్ అంటూ మహా తుఫాన్ వచ్చేస్తోంది. ఈ మహా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.  నవంబర్ 06వ తేదీ బుధవారం మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి బుల్ బుల్ తుఫాన్ అని పేరు పెట్టారు. రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారి బెంగాల్ వైపు వెళుతుందని అంచనా వేస్తున్నారు.
 
ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. తుఫాన్ ఖచ్చితంగా ఏ దిశలో వెళుతుందనేది నిర్ధారణ కాలేదని తెలిపారు. నవంబర్ 08వ తేదీ శుక్రవారం నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. 
 
ని ప్రభావం వల్ల నవంబర్ 06 బుధవారం, నవంబర్ 07వ తేదీ గురువారం అండమాన్ - నికోబార్ దీవుల్లో, నవంబర్ 09వ తేదీన ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 
 
ఉత్తర అండమాన్ సముద్రం, ఒడిశాలోని పారాదీప్ ఆగ్నేయంగా 890 కి.మీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు ఆగ్నేయంగా 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. తుఫాన్ ఖచ్చితంగా ఏ దిశలో వెళుతుందనేది నిర్ధారణ కాలేదని వెల్లడించారు.