సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (16:00 IST)

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ షాకింగ్ న్యూస్.. హికా వచ్చేస్తోంది..

తెలుగు రాష్ట్రాలను హికా తుఫాన్ తాకనుంది. తెలుగు రాష్ట్రాల వైపు హికా తుఫాను వేగంగా దూసుకొస్తోంది. దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు హికా తుపాను దూసుకొస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
 
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం హికాతో దక్షిణాది రాష్ట్రాలతో ఇబ్బందులు తప్పవని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతున్న తరుణంలో హికాతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 
 
హికా ప్రభావంతో అరేబియా తీరంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హికా తుపానుతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 
 
రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. అంతేగాకుండా మరో 48 గంటల్లో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.