శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శుక్రవారం, 3 మే 2019 (19:41 IST)

ఒడిషాలో విధ్వంసం సృష్టించిన ఫోనీ తుఫాన్(Video)

బంగాళాఖాతంలో సుదీర్ఘంగా ప్రయాణించిన ఫోనీ తుఫాన్ తొలుత తమిళనాడు తీరాన్ని తాకుతుందనీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అనుకున్నారు. ఐతే అది ఒడిషా వద్ద తీరాన్ని దాటింది. దీనితో ఇక్కడ ప్రచంఢ గాలులతో బీభత్సం సృష్టించింది ఫోనీ తుఫాన్.

భువనేశ్వర్ లోని ఎయిమ్స్ హాస్టల్ పైకప్పు ఎగిరిపోయింది. అంతేకాదు.. క్లాసు రూముల్లో వున్న ఫర్నీచర్, కంప్యూటర్లు కాగితాల మాదిరిగా గాల్లో ఎగెరెళ్లిపోయాయి. సమీపంలో వున్న భారీ కట్టడానికి ఉపయోగించే క్రేన్ సైతం భారీ గాలుల దెబ్బకు కూలిపోయింది.


ఇక భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా పెకలించుకుపోయాయి. వేల సంఖ్యలో గుడిసెలు నేలమట్టమవ్వటమే కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైనట్లు తెలుస్తుంది. కాగా ఫోనీ తుఫాన్ కారణంగా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సుమారు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా ఈ తుఫాన్ భారీ నష్టాన్ని కలిగించిందని ప్రాధమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.