సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (14:50 IST)

ఒకే చీరతో... ఒకే కొమ్మకు ఉరేసుకున్న ప్రేమికులు?

తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఒకే చీరతో ఒకే కొమ్మకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని నవరంగ్‌పూర్ జిల్లా జయపురంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖెమరా గ్రామానికి చెందిన సునాఘడ్ (21), కుమారి జాని (20)లు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని భావించారు. 
 
అయితే, ఈ విషయం వారు చెప్పక ముందే ఇంట్లోని పెద్దలకు తెలిసింది. వారు పెళ్లికి నిరాకరించారు. పైగా, వీరిద్దరూ వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారని తెలియడం వల్లే ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదని స్థానికులు చెబుతున్నారు.  దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన వీరిద్దరూ ప్రాణాలు తీసుకున్నారు.