శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (17:59 IST)

ఆమెకు కావలసింది నేను తీరిస్తే ఎలా ఉంటుందో అనిపిస్తోంది...

నా గర్ల్ ఫ్రెండ్ నేను కాలేజీ రోజుల్లో చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఐతే మాది ప్రేమేనేమో అనుకునేలోపు ఆమెకు పెళ్లయిపోయింది. ఆ తర్వాత చానాళ్లు ఆమె నాతో మాట్లాడలేదు. ఈమధ్య నాకు ఫోన్ చేసి తన సంసారం గురించి చెప్పింది. తన భర్త చాలా ప్రేమగా చూసుకుంటారని, తనకు ఏది కావాలంటే అది క్షణాల్లో తెచ్చిస్తారని చెప్పింది. ఇలా కొన్నాళ్లు మామధ్య మాటలు నడిచాయి.
 
ఈమధ్య ఆమె తమ శృంగార జీవితాన్ని కూడా వెల్లడించింది. బెడ్రూంలో వాళ్లాయన వానపామట. ఒక్క నిమిషానికే వాలిపోతాడట. కానీ నా గర్ల్ ఫ్రెండుకు కనీసం గంటకు పైగా కావాలనిపిస్తోందట. ఏం చేయాలో తోచడం లేదని అంటోంది. ఈ టాపిక్ ఈమధ్య నావద్ద ఎక్కువగా తెస్తోంది. ఆమె చెపుతుంటే ఆమెకు కావలసింది నేను తీరిస్తే ఎలా ఉంటుందో అనిపిస్తోంది. అలా చేస్తే ఆమె బాగా తృప్తి చెందుతుంది కదా.
 
మీ ఆలోచన సరైంది కాదు. ఆమె వివాహం చేసుకున్నది. పైగా వాళ్లద్దరి మధ్య శృంగార సంబంధ సమస్య తప్ప మరో సమస్య లేనట్లు తెలుస్తుంది. కొంతమంది పురుషుల్లో ఇలాంటి సమస్య ఉంటుంది. అతిగా శృంగారం పట్ల ఉద్రేకపడినా, లేదంటే కొన్ని రకాల సమస్యల కారణంగానైనా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు. వైద్యుడిని సంప్రదించి అతడి సమస్యను చెబితే తగు పరిష్కారం లభిస్తుంది. 
 
ఆమె అనుకున్నట్లుగా గంటకు పైగా శృంగార తృప్తిని అనుభవించవచ్చు. కాబట్టి మీ స్నేహితురాలి భర్తను వైద్యుడిని సంప్రదించి సంతోషకరమైన శృంగార జీవితాన్ని చవిచూడాలని చెప్పండి. అంతేతప్ప... అతడి స్థానంలో మీరు వెళ్లాలని చూస్తే ఆమె జీవితం సర్వనాశనమవుతుంది.