శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (12:15 IST)

బుల్ బుల్ తుఫాన్ ముంచుకోస్తోంది.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లకే ముప్పు

బుల్ బుల్ తుఫాన్ ముంచుకోస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుంది. వచ్చే 24గంటల్లో బుల్ బుల్ తుఫాన్ భీకర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒడిశా మినహా.. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల మీదుగా ఈ భయంకర తుఫాన్ దూసుకొస్తోందని ఐఎండీ తెలిపింది.  
 
ఒడిశాలో దిశ మార్చుకున్న బుల్‌బుల్ తుఫాన్ దక్షిణం నుంచి పారాదీప్ ఆగ్నేయంగా 730కిలోమీటర్ల దూరంలో వేగంగా పయనిస్తుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో మధ్య దిశగా పయనిస్తూ 7 కిలోమీటర్ల వేగంతో పుంజుకుంటోంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ దిశ నుంచి ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోందని భువనేశ్వర్ మెట్రోలాజికల్ సెంటర్ డైరెక్టర్ హెచ్ ఆర్ బిస్వాస్ తెలిపారు. 
 
తీరం దాటే సమయంలో 30 నుంచి 40కిలో మీటర్ల మేర బలంగా గాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు బిస్వాన్ వెల్లడించారు. ముందుస్తు జాగ్రత్తగా ఒడిశా ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.