బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (10:07 IST)

ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వరుడే కావాలి.. అమ్మాయి షరతు

కొంతమంది అమ్మాయిలు తమ ఇష్టాలకు అనుగుణంగానే వరుడుని ఎంపిక చేసుకుంటారు. తాజాగా ఓ యువతి... కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వరుడే కావాలంటూ షరతు పెట్టింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
సాధారణంగా, వరుడు లేదా వధువు కోసం కొన్ని వివరాలు ఇస్తారు. ఎత్తు, కలర్, విద్యార్హతలు, ప్రాంతం, కులం వివరాలు ఇస్తారు. కాని ఈ పెళ్లి ప్రకటనలో వింత షరతు విధించడం ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తున్నది. 
 
తనను పెళ్లి చేసుకునేవాడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని వధువు స్పష్టం చేసింది. అది కూడా రెండు డోసులు వేసుకున్న వరుడే అర్హుడు అని ప్రకటించడాన్ని చూసి పలువురు పడిపడి నవ్వుతున్నారు. 
 
ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. ఈ అర్హతలు ఉన్నవారు సంప్రదించవచ్చని వాట్సప్ నెంబర్ కూడా ఇచ్చేసింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇలాంటి షరతులు ఉంటాయని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
 
అయితే, రోమన్ కేథలిక్ వర్గానికి చెందిన యువతి వయసు 24 యేళ్లు. 5 అడుగులా 4 అంగుళాలు ఉన్నాయి. ఎమ్మెస్సీ మ్యాథ్స్‌లో డిగ్రీ పూర్తిచేసింది. ఇదే సామాజిక వర్గానికి చెందిన 28 నుంచి 30 యేళ్ళ వయస్సుండే వరుడే కావాలంటూ ప్రకటన ఇచ్చింది. అందులో తన వాట్సాప్ నంబరును కూడా ఇచ్చింది.