ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (10:18 IST)

థానెలో ఆర్పీఎఫ్ జవాన్లపై రేప్ కేసు...

మహారాష్ట్రలోని థానేలో ఆర్బీఎఫ్ జవాన్లపై రేప్ కేసు నమోదైంది. ప్రజలకు, దేశ పౌరులకు భద్రత కల్పించాల్సిన సైనికులే మహిళపై ఆఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

మహారాష్ట్రలోని థానేలో ఆర్బీఎఫ్ జవాన్లపై రేప్ కేసు నమోదైంది. ప్రజలకు, దేశ పౌరులకు భద్రత కల్పించాల్సిన సైనికులే మహిళపై ఆఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. 
 
సెంట్రల్ రైల్వేకు చెందిన నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు 25 ఏళ్ళ వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ రైల్వే డీపీసీ రుపాలీ అంబురే తెలిపారు.
 
థానె, దివాలోని ఆర్పీఎఫ్ క్యాబిన్ లో జనవరి 14న తనపై జవాన్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధిత మహిళ ఇటీవల ఫిర్యాదు చేయడంతో నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లపై థానే రైల్వే పోలీసులు రేప్ కేసు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు.