1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2016 (14:31 IST)

బెంగళూరులో దారుణం : రోడ్డుపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ముక్కలు ముక్కలుగా నరికేశారు

బెంగుళూరులో దారుణం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తను కొందరు దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటనకలకలం రేపుతోంది. దాడిలో మృతి చెందిన వ్య‌క్తి పేరు రు

బెంగుళూరులో దారుణం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తను కొందరు దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటనకలకలం రేపుతోంది. దాడిలో మృతి చెందిన వ్య‌క్తి పేరు రుద్రేష్‌(35)గా గుర్తించిన‌ట్లు పోలీసులు తెలిపారు. 
 
హతుడు ఓ సమావేశంలో పాల్గొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా, కమర్షియల్‌ స్ట్రీట్‌ సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తులతో వచ్చి.. రుద్రేష్‌పై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. 
 
ఈ ఘ‌ట‌న‌ను గురించి తెలుసుకున్న తాము ఘటనా స్థలానికి చేరుకొని రుద్రేష్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా దారిలోనే ఆయన మృతిచెందిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.