ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (18:23 IST)

రాత్రుల్లో నిద్రలేదు.. నన్ను తీసుకెళ్లిపోండి.. బోరుమన్న శశికళ.. పుళల్ జైలుకు మార్చేస్తారా?

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా బెంగళూరులోని పరప్పన జైలులో చిప్పకూడు తింటున్న చిన్నమ్మ శశికళకు రాత్రిపూట నిద్రపట్టట్లేదట. ఈ విషయాన్ని తనను జైలులో చూసేందుకు వచ్చిన వారితో చెప్పుకుని

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా బెంగళూరులోని పరప్పన జైలులో చిప్పకూడు తింటున్న చిన్నమ్మ శశికళకు రాత్రిపూట నిద్రపట్టట్లేదట. ఈ విషయాన్ని తనను జైలులో చూసేందుకు వచ్చిన వారితో చెప్పుకుని బోరున ఏడ్చేసిందట. జైలులో నిద్రించలేకపోతున్నానని.. తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి.. అంటూ శశికళ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. 
 
శశికళను మన్నార్‌గుడి బంధువులు జైలులో చూసేందుకు వెళ్లారు. వారి ముందు చిన్నమ్మ ఏడుపు ఆపుకోలేకపోయిందని.. రాత్రిపూట నిద్రపట్టట్లేదని బోరున విలపించినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు దుఃఖాన్ని దిగమింగుకుని సింహంలా ఉండిన చిన్నమ్మ.. జైలులో పడే కష్టాలతో ఏడుపును ఏమాత్రం ఆపుకోలేకపోయారని ఆమె తరపు బంధువులు అనుకుంటున్నట్లు సమాచారం.
 
ఇంకా జైలులో ఎండ వేడిమి తీవ్రత ఎక్కువగా ఉందని తట్టుకోలేకపోతున్నానని.. తద్వారా ఆహారం తీసుకోలేకపోతున్నానని.. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నానని.. శశికళ బంధువులతో వెల్లడించినట్లు తెలిసింది. రాత్రంతా నిద్రపట్టక మేల్కొనే ఉంటున్నానని.. అన్నారట. కానీ శశికళను చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు మార్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ధైర్యంగా ఉండాల్సిందిగా మన్నార్ గుడి బంధువులు చిన్నమ్మతో చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.