1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (09:28 IST)

శశికి జైలు ముందే తెలుసు.. శివనమలై ఆండవర్ కోయిల్‌లో ఇనుప గొలుసును ఉంచి పూజ..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కేసు తీర్పు ముందుగానే తెలిసిపోయింది. శివనమలై ఆండవర్‌ ఉత్తర్వుల పెట్టెలో ఇనుప గొలుసును ఉంచి పూజ చేయడం ద్వారా చిన్నమ్మ ఊచలు లెక్కలు పెడుతోంది. ఇక శివనమలై ఆండవర్ కోయిల

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కేసు తీర్పు ముందుగానే తెలిసిపోయింది. శివనమలై ఆండవర్‌ ఉత్తర్వుల పెట్టెలో ఇనుప గొలుసును ఉంచి పూజ చేయడం ద్వారా చిన్నమ్మ ఊచలు లెక్కలు పెడుతోంది. ఇక శివనమలై ఆండవర్ కోయిల్ తిరుప్పూర్ జిల్లా గాంగేయం శివనమలై ఉంది. ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్య స్వామి భక్తుల స్వప్నంలో కనిపిస్తే.. ఆండవర్‌ నిర్దేశిత వస్తువులను పెట్టెలో ఉంచి పూజించాలని ఆదేశిస్తారు. 
 
ఉత్తర్వులు పొందిన భక్తులు ఆలయానికి వచ్చి పూజారి వద్ద తెలియజేస్తే, దేవుని ఉత్తర్వులను ఖరారు చేసేందుకు భగవంతుని వద్ద పుష్పాన్ని కోరి అనుమతులు పొందిన తర్వాతే ఉత్తర్వుల వస్తువును పెట్టెలో ఉంచుతారు. ఆ వస్తువు మరో ఉత్తర్వు వచ్చేంత వరకు పెట్టెలో అలాగే ఉంటుంది. అలా ఉంచిన వస్తువుకు సంబంధించి ఏదైనా ఓ సంఘటన చోటుచేసుకుంటుందని భక్తులు గాఢంగా నమ్ముతారు. 
 
భగవంతుని ఉత్తర్వుల పెట్టెలో తుపాకీ ఉంచిన సమయంలో చైనా యుద్ధం, జలాన్ని ఉంచినపుడు సునామీ వంటి వివిధ సంఘటనలు సంభవించాయి. గత జనవరి 10వ తేదీ నుంచి ఆండవర్‌ ఉత్తర్వుల పెట్టెలో ఇనుప గొలుసును ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం శశికళతో సహా ముగ్గురికి జైలు శిక్ష ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును ముందుగానే తెలియజేసే విధంగా శివనమలై ఆండవర్‌ ఇనుప గొలుసును ఉంచి పూజించాలని భక్తులను ఆదేశించినట్టు భక్తులు అంటున్నారు.