బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (10:57 IST)

థానేలో దారుణం... బాలికలపై ఆరునెలలుగా వ్యాన్ డ్రైవర్ అత్యాచారం

మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలను చెరబట్టిన ఓ 35 యేళ్ల వ్యాను డ్రైవర్.. గత ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలను చెరబట్టిన ఓ 35 యేళ్ల వ్యాను డ్రైవర్.. గత ఆర్నెల్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
థానేలోని భీవండికి చెందిన తులసీరాం మనేరె (35) అనే వ్యక్తి తన వ్యానులో ప్రతిరోజూ విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 8, 9 యేళ్ళ  వయస్సు ఉన్న ఇద్దరు బాలికలపై కన్నేసిన మనేరె... ఇద్దరు పిల్లలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని ఆరు నెలలుగా లైంగిక దాడి చేస్తూ వచ్చాడు. అయితే, ఈ విషయాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పి పాఠశాలకు వెళ్లడం మానేశారు.
 
దీంతో ఉపాధ్యాయులు ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. తన వ్యానులో నిర్మానుష్యమైన ప్రదేశాలకు తీసుకెళ్లి బాలికపై ఘాతుకానికి పాల్పడుతూ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.