బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2017 (09:29 IST)

అందంగా వున్నావ్.. ఏ క్రీమ్ రాసుకుంటున్నావ్.. మౌంట్ అబూకి వెళ్దామా?

సెల్ఫీ ఓ కానిస్టేబుల్‌ను చిక్కుల్లో నెట్టింది. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందని.. ఓ నిందితురాలితో తీసుకున్న సెల్ఫీ కానిస్టేబుల్‌ను చిక్కులో పడేసింది. నిందితురాలితో సెల్ఫీ తీసుకోవడమే కాకుండా ఆమెను తనతో క

సెల్ఫీ ఓ కానిస్టేబుల్‌ను చిక్కుల్లో నెట్టింది. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందని.. ఓ నిందితురాలితో తీసుకున్న సెల్ఫీ కానిస్టేబుల్‌ను చిక్కులో పడేసింది. నిందితురాలితో సెల్ఫీ తీసుకోవడమే కాకుండా ఆమెను తనతో కలిసి టూరుకు రావాలని కోరిన ఓ గుజరాత్ కానిస్టేబుల్‌ కష్టాల్లో పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ పరిధిలోని దరియాపూర్ ప్రాంతంలో అమీనా షేక్ అనే మహిళ, కారులో మద్యం బాటిళ్లతో వెళుతుండగా, మొబైల్ పోలీసుల టీమ్ పట్టుకుంది. ఆ టీమ్‌లోని శైలేష్ అనే కానిస్టేబుల్, కారులో ఆమెతో సెల్ఫీ దిగాడు. 
 
చాలా అందంగా వున్నావని పొగడటమే కాకుండా.. ముఖానికి ఏ క్రీమ్ రాసుకుంటావని అడిగాడు. ఇంకా సరదాగా మౌంట్ అబూ వరకు వెళ్దాం.. వస్తావా అంటూ ప్రశ్నించాడు. ఈ వ్యవహారంపై అమీనా ఫిర్యాదు చేయడంతో... ఏసీపీ బలదేవ్ దేశాయ్ విచారణకు ఆదేశించారు.