శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (17:30 IST)

తల్లిని సరిగా చూసుకోవడం లేదనీ భార్యలను తగలబెట్టిన భర్త...

తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో తన ఇద్దరు భార్యలను తగలబెట్టాడోభర్త. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో తన ఇద్దరు భార్యలను తగలబెట్టాడోభర్త. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్‌కు చెందిన దీపా రామ్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వృద్ధురాలైన ఈయన తల్లికూడా వీరితోనే కలిసివుంటుంది. అయితే, ఆ తల్లిని తన ఇద్దరు భార్యలు సరిగా చూడటం లేదని గ్రహించిన దీపారాయ్ వారిద్దరికి తగిన గుణపాఠం చెప్పాలని భావించాడు. ఇందుకోసం ఓ ప్లాన్ వేశాడు. 
 
బంగారం కొనిస్తా అంటూ తన ఇద్దరు భార్యలు దరియా దేవి, మాలి దేవిలను ఇంటి నుంచి కారులో తీసుకెళ్లాడు. కారులో ఈ ముగ్గురూ గొడవపడ్డారు. దీంతో ఇద్దరు భార్యల్లో ఒకరు కారు నుంచి దిగి అక్కడున్న వారి సాయం కోరడానికి ప్రయత్నించింది. అయితే దీపా రామ్ ఆమెను మళ్లీ కారులో నెట్టేసి అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. 
 
కొంత దూరం తర్వాత తాను బయటకు వచ్చి కారును లాక్ చేసిన దీపారామ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇద్దరు భార్యలకు గాయాలయ్యాయి. తాను నేరం చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.