గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2017 (12:32 IST)

మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం.. కోవైలో ముఠా అరెస్ట్..

మసాజ్ సెంటర్ పేరిట కోయంబత్తూరులో వ్యభిచారం నిర్వహించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోవై నెహ్రూ నగర్లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది.

మసాజ్ సెంటర్ పేరిట కోయంబత్తూరులో వ్యభిచారం నిర్వహించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోవై నెహ్రూ నగర్లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. కారులో, బైకుల్లో అనేక మంది ఆ ఇంటికి వచ్చిపోతున్నారని స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో అపార్ట్‌మెంట్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 
 
ఈ తనిఖీల్లో ఆయుర్వేదిక్ మసాజ్ పేరిట.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ సెంటర్‌ను నిర్వహించిన దిండుక్కల్‌కు చెందిన సలీమ్ మాలిక్ (30), మధురైకి చెందిన పవున్ రాజ్ (30), ఢిల్లీకి చెందిన నితిన్ ముఖర్జీ (28) అనే వ్యక్తులతో కూడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 15 రోజుల క్రితమే సలీమ్ ముఠా రూ.15వేలను ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారాన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యభిచార రొంపికి చెందిన ఓ మహిళను పోలీసులు విడిపించి.. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.