శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (16:36 IST)

కరోనా బాధితుల కోసం నర్సుగా మారిన షారూఖ్ హీరోయిన్

కరోనా బాధితులను ఆదుకునేందుకు సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇక్కడ హీరోయిన్ శిఖా మల్హోత్రా మాత్రం విభిన్నంగా స్పందించింది. నర్సింగ్ డిగ్రీ చేసిన ఆమె స్వయంగా నర్స్‌‌గా ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తోంది. 
 
షారూఖ్‌ ఖాన్‌ హీరోగా రూపొందిన `ఫ్యాన్` సినిమాలో పేరు తెచ్చుకున్న నటి శిఖా మల్హోత్రా. ఈ యువ నటీమణి ఓ హాస్పిటల్ లో కరోనా వైరస్‌ భారిన పడిన రోగులకు నర్స్‌గా సేవలందిస్తోంది. శిఖా ఢిల్లీలోని వర్ధమాన్‌ మహావీర్ మెడికల్‌ కాలేజ్‌, సఫ్ దార్‌ జంగ్ హాస్పిటల్లలో నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసింది.
 
ప్రస్తుతం నర్స్‌గా సేవలందిస్తున్న శిఖా మన దేశానికి సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా వుంటానని.. ఇందుకు మీ ఆశీస్సులు కావాలని చెప్పింది. దయచేసి అందరూ ఇంటి దగ్గరే ఉండండి. అధికారులకు సహకరించండి అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. ముంబైలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.