శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (15:46 IST)

షీనా బోరా హత్య కేసు.. ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాలపై నేరపూరిత అభియోగాలు..

షీనా బోరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై షీనా కేసులో నిందితులైన షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి భర్త పీటర్‌ ముఖర్జీలపై అధికారులు హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు

షీనా బోరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై షీనా కేసులో నిందితులైన షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీ, ఇంద్రాణి భర్త పీటర్‌ ముఖర్జీలపై అధికారులు హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేశారు. ఈ అభియోగాలపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విచారణ జరుగనుంది. గత కొన్నేళ్లుగా ఈ కేసుపు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ కేసులో ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ రాయ్ నాలుగో నిందితుడు. 
 
షీనాను హత్య చేయడానికి సహకరించాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే అతడు అప్రూవర్‌గా మారాడు. 2012 ఏప్రిల్‌లో ముంబయి శివారు ప్రాంతంలో ఇంద్రాణి తన మాజీ భర్తతో కలిసి కారులో షీనాను గొంతు నులిమి చంపేశారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 2015లో ముంబయి సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సగం కాలిపోయిన స్థితిలో షీనా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
షీనా బోరా సోదరుడు మైకేల్‌ బోరాపై కూడా హత్యాయత్నం చేశారనే అభియోగాలతో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్‌ ఖన్నాపై ప్రత్యేక సీబీఐ కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి. షీనా బోరా కనిపించకుండా పోవడంపై మైకేల్‌ ఎన్నో ప్రశ్నలు అడుగుతుండడంతో ఇంద్రాణి అతడిని కూడా చంపాలని ప్లాన్ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.