గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (13:27 IST)

కోటి రూపాయల నల్లధనాన్ని పట్టిచ్చిన మహిళ.. పోలీసులు బెదిరింపులు..

నల్ల కుబేరుడి నుంచి లంచం తీసుకుని మహిళ పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోమని పోలీసులు బెదిరించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కోటి రూపాయల నల్లధనాన్ని పట్టించిన మహిళను అభినందించాల్సిందిపోయి.. మహిళను పోలీసు

నల్ల కుబేరుడి నుంచి లంచం తీసుకుని మహిళ పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోమని పోలీసులు బెదిరించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కోటి రూపాయల నల్లధనాన్ని పట్టించిన మహిళను అభినందించాల్సిందిపోయి.. మహిళను పోలీసులు వేధింపులకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో జహంగీర్ పురి ప్రాంతానికి చెందిన అష్మినా షియాకా అనే ఓ మహిళ ఓ పాన్ షాపు నడుపుతోంది.
 
ఈ నెల 14 వతేదీన ఓ స్క్రాప్ డీలరు కోటిరూపాయల బ్యాగును ఇంట్లో దాచిపెట్టాడని అష్మినా పోలీసులకు సమాచారం అందించింది. అంతే జహంగీర్ పురి ప్రాంత బీట్ పోలీసులు వచ్చి స్క్రాప్ డీలరు ఇంటిపై దాడి చేసి అతన్ని విచారించేందుకు పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. మరునాడు పోలీసులు లంచం తీసుకొని ఆ స్ర్కాప్ డీలరును వదిలిపెట్టారు. 
 
పోలీసులు తన వద్దకు వచ్చి స్క్రాప్ డీలర్‌పై పెట్టిన నల్లధనం కేసును వాపసు తీసుకోవాలని బెదిరించారని మహిళ అష్మినా తెలిపారు. ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు రూ.2లక్షలు ఇస్తానని పోలీసులు ఆశ చూపించారని అష్మినా ఆరోపించారు. నల్లధనం వ్యవహారం, పోలీసుల తీరుపై అష్మినా డీసీపీ మిలంద్ దుంబ్రేను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.