శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 2 డిశెంబరు 2016 (14:49 IST)

షాకింగ్ పెళ్లికూతురు... శోభనం రోజున కొత్త పెళ్లి కొడుక్కి మత్తెక్కించి మంచంపై పడేసి...

ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందో లేదంటే దొంగతనాలకు అలవాటు పడిందో తెలియదు కానీ పెళ్లయిన తర్వాత శోభనం రోజున కొత్త పెళ్లి కొడుక్కి మత్తెక్కించి మంచం మీద పడేసి అతడు గుర్రుపెట్టి నిద్రలోకి జారుకోగానే చేయాల్సిందంతా చేసేసింది. ఇంట్లో ఉన్న నగదు, పెళ్లి కొడుకు

ఆ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందో లేదంటే దొంగతనాలకు అలవాటు పడిందో తెలియదు కానీ పెళ్లయిన తర్వాత శోభనం రోజున కొత్త పెళ్లి కొడుక్కి మత్తెక్కించి మంచం మీద పడేసి అతడు గుర్రుపెట్టి నిద్రలోకి జారుకోగానే చేయాల్సిందంతా చేసేసింది. ఇంట్లో ఉన్న నగదు, పెళ్లి కొడుకు వంటిపై ఉన్న నగలు, బీరువాలో ఉన్న డబ్బు,నగలు అన్నీ తీసుకుని మూటగట్టుకుని పారిపోయింది. 
 
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలోని మోదీనగర్‌లో జరిగింది. శోభనం రోజున కొత్త జంటను గది లోనికి పంపి అత్తమామలు నిద్రకు ఉపక్రమించారు. ఐతే కొత్త పెళ్లికూతురు తన భర్తతో మత్తు మాటలు చెపుతూ పాలలో నిద్రమాత్రలు వేసి వాటిని అతడికి ఇచ్చింది. అతనికి మత్తు రావడంతో నిద్రలోకి జారుకున్నాడు. 
 
దాంతో మెల్లగా ఇంట్లో నగదు, నగలు తీసుకుని చెక్కేసింది. తెల్లారిన తర్వాత గదిలోకి వెళ్లి చూస్తే తమ కుమారుడు మత్తులో జోగుతూ కనిపించాడు. పక్కనే కోడలు లేకపోవడంతో తొలుత కంగారుపడ్డారు. ఐతే అక్కడున్న ఆనవాలు చూసి ఆమె మోసం చేసిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పారిపోయిన పెళ్లి కూతురు కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.