1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (09:40 IST)

అరవింద్ కేజ్రీవాల్‌పై షూ విసిరిన యువకుడు.. మోడీ పిరికి వ్యక్తి.. అతనే చెంచాలను?

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీ వాల్‌కు నూతన సంవత్సరం తొలి రోజే చేదు అనుభవం ఎదురైంది. గతంలో కూడా ఢిల్లీ సిఎంపై షూ విసరడం, ఇంకు చల్లిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో జనవరి 1న ఆయనపై ఓ యువకుడు షూ విసిరాడు. హర్యాన

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీ వాల్‌కు నూతన సంవత్సరం తొలి రోజే చేదు అనుభవం ఎదురైంది. గతంలో కూడా ఢిల్లీ సిఎంపై షూ విసరడం, ఇంకు చల్లిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో జనవరి 1న ఆయనపై ఓ యువకుడు షూ విసిరాడు. హర్యానా రోహ్తక్‌లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. యువకుడు విసిరిన బూటు సిఎంకు కొంత దూరంలో పడింది. 
 
నోట్ల రద్దును కేజ్రీవాల్ విమర్శిస్తున్న సమయంలో ఆ వ్యక్తి షూ విసిరాడు. దీంతో ప్రధాని మోడీ మద్దతుదారులే ఈ పనిచేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. షూ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎం మోడీ చెంచాలను తనపైకి దాడికి ఉసిగొల్పుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. తాను ముందు నుంచి మోడీ పిరికి వ్యక్తి అని చెబుతూ ఉన్నాననే..ఇప్పుడూ అదే చెబుతున్నానని ఆయన విమర్శించారు.