ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (21:11 IST)

త్వరలో మళ్లీ బుల్లి తెర ముందుకు అమితాబ్

కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న అమితాబ్‌ త్వరలో మళ్లీ బుల్లి తెర ముందుకు రాబోతున్నారు. అతి త్వరలోనే పాపులర్‌ టెలివిజన్‌ గేమ్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబిసి) తర్వాతి సీజన్‌ కోసం షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు స్వయంగా అమితాబ్‌ వెల్లడించారు.

అత్యంత భద్రతా ప్రమాణాలు తీసుకుంటూ షోను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.   'జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని జాగ్రత్తలతో రెండు రోజుల షెడ్యూల్‌ను ఒక్కరోజులోనే పూర్తయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాం. త్వరలోనే టెలివిజన్‌పై కనిపిస్తా' అంటూ అమితాబ్‌ పేర్కొన్నారు.