శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (18:17 IST)

గ్యాంగ్ రేప్: సమాజ్‌వాదీ ఎమ్మెల్యేకు క్లీన్ చిట్‌కు బాధితురాలి హత్యకు లింకుందా? ఎవరు చంపారు?

యూపీలో 21 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో నిందితులపై ఇంకా చర్యలు తీసుకోలేదు. కానీ నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంఏల్ఏల అరుణ్ వర్మ కూడ ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. కానీ బాధితు

యూపీలో 21 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో నిందితులపై ఇంకా చర్యలు తీసుకోలేదు. కానీ నిందితుల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంఏల్ఏల అరుణ్ వర్మ కూడ ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. కానీ బాధితురాలు మరణించడంపై స్థానికంగా కలకలం రేపుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తానాపూర్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ళ యువతిపై 2013లో ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎంఏల్ఏ అరుణ్ వర్మ కూడ ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై  బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు విచారణ జరిపి అరుణ్ వర్మకు క్లీన్ చీట్ ఇచ్చారు. 
 
అరుణ్ వర్మే కాకుండా ఇతర నిందితులు కూడా విచారణలో తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంటి బయటే ఉన్న వాష్ రూమ్‌కు వెళ్ళిన బాధితురాలు కన్పించకుండా పోయింది. పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే.. ఆమె మృతదేహం ఇంటికి సమీపంలో కన్పించింది. ఎవరో బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
అత్యాచారానికి పాల్పడిన వారే ఈ హత్యకు కూడా పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే అత్యాచారం ఆపై హత్యకు గురైన తమ బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు పోలీసులు, అరుణ్ కుమ్మక్కై తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు బాధితురాలి హత్యపై దర్యాప్తు జరుపుతున్నారు.