ఇక తక్షణమే విడాకులు పొందొచ్చు... సుప్రీం కోర్టు
దంపతులు విడాకులు పొందడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దంపతుల మధ్య రాజీ కుదిర్చేందుకు 6 నెలల గడువు విధిస్తుంది కోర్టు. అంటే ఇప్పటివరకూ విడాకులు తీసుకోవాలంటే 6 నెలల గడువు ఉండేది. అయితే ఇకపై ఈ నిబంధనలు ఉండవు. తక్షణమే విడాకులు తీసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
స్నేహితుల్లా విడిపోవాలనుకునే వారికి 6 నెలల వ్యవధితో పనిలేదని కోర్టు తెలియజేసింది. ఓ విడాకుల కేసులో రాజీకి వచ్చిన జంట కేసులో తీర్పును ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని వెల్లడించింది. విడాకుల విషయంలో దంపతుల మధ్య సరైన స్పష్టత, పరస్సర అంగీకారం ఉన్నప్పుడు 6 నెలలు ఆగాల్సిన అవసరంలేదని తెలియజేసింది.