శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 13 అక్టోబరు 2018 (10:30 IST)

దేశంలో అందరూ శాకాహారులుగా మారాలనుకుంటున్నారా? సుప్రీం ప్రశ్న

మాంసం ఎగుమతులపై నిషేధం విధించాలంటూ.. దాఖలైన పిల్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

మాంసం ఎగుమతులపై నిషేధం విధించాలంటూ.. దాఖలైన పిల్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అంతేగాకుండా దేశంలోని అందరూ శాకాహారులుగా మారాలని కోరుకుంటున్నారా? అంటూ జస్టిస్ మదన్ బి లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది.
 
కాగా, బుధవారం హిందూత్వ సంస్థలకు చెందిన పలువురు యువకులు ఢిల్లీ వీధుల్లో హల్ చల్ చేశారు. మాంసం దుకాణాలు మూసెయ్యాలంటూ హడావిడి చేశారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేవరకు మాంసం దుకాణాలు తెరిస్తే షాపులు ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. 
 
పాలెం విహార్, సూరత్ నగర్, అశోక్ విహార్, సెక్టార్ 5, 9, పటౌడీ చౌక్, జాకోబ్‌పురా, సదర్ బజార్, ఖద్సా అనాజ్ మండి, బస్టాండ్, డీఎల్ఎఫ్ ప్రాంతం, సోహ్నా, సెక్టార్ 14 సహా పలు చోట్ల షాపులు బలవంతంగా మూసివేయించినట్టు తెలుస్తోంది. కొందరు మాంసం వ్యాపారులు మాట్లాడుతూ, శివసేన కార్యకర్తలు తమ షాపులను బలవంతంగా మూయించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాంసాహార నిషేధంపై వేసిన పిల్‌పై సుప్రీం పై విధంగా  స్పందించడం గమనార్హం.