శుక్రవారం, 4 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (19:02 IST)

50లక్షల ఫాలోవర్స్‌: ట్విట్టర్ ప్రపంచ మహిళా నాయకుల్లో సుష్మా స్వరాజ్ టాప్..!!

సోషల్ మీడియాలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రత్యేక రికార్డును నెలకొల్పారు. ట్విట్టర్‌ను అత్యధిక సంఖ్యలో ఆదరణ ఉన్న ప్రపంచ మహిళ నాయకుల్లో సుష్మా స్వరాజ్ అగ్రస్థానంలో నిలిచారు. 50లక్షల మంది ఫాలోవర్స్‌తో సుష్మా స్వరాజ్ ఈ రికార్డును నెలకొల్పారు.

2016 ట్విప్లోమసీ పేరుతో అంతర్జాతీయ ట్విట్టర్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు. ఇందులో భాగంగా ట్విట్టర్లో అత్యధిక ఆదరణ గల తొలి పదిమందిలో  సుష్మా స్వరాజ్ తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. 
 
ఇంకా పురుషుల ర్యాంకులో.. 
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మూడో స్థానం (2 కోట్ల ఫాలోవర్స్)
ఇక భారత పీఎంఓ కార్యాలయం 1.1 కోట్లతో తొలిసారిగా నాలుగో స్థానంలో నిలిచింది. 
ఇక అగ్రస్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (7.5 కోట్లతో)..
2.8 కోట్ల మంది అనుసరిస్తున్న పోప్‌ ఫ్రాన్సిస్‌ రెండోస్థానంలో నిలిచారు.
ట్విట్టర్‌ను 173 దేశాల ప్రభుత్వాలు, ఫేస్‌బుక్‌ను 168 దేశాల ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నట్లు ఈ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది.