ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 17 నవంబరు 2016 (12:58 IST)

సుష్మా స్వరాజ్‌కు దొరకని కిడ్నీ దాత... ఆసుపత్రిలో ఎదురుచూస్తూ....

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మూత్రపిండాలు విఫలం కావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె రెండు మూత్రపిండాలు పాడైపోవడంతో శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించి సరిపడే కిడ్నీలు అమర్చాల్సి ఉంటుంది. ఆమెకు కిడ్నీలను దానం చేస్తామని వచ్చిన

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మూత్రపిండాలు విఫలం కావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమె రెండు మూత్రపిండాలు పాడైపోవడంతో శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించి సరిపడే కిడ్నీలు అమర్చాల్సి ఉంటుంది. ఆమెకు కిడ్నీలను దానం చేస్తామని వచ్చినవారి కిడ్నీలు ఆమెకు సెట్ కావడం లేదని వైద్యులు తెలిపారు. 
 
అందువల్ల ఆమెకు సూట్ అయ్యే కిడ్నీలను దానం చేసే డోనర్లు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ కారణంగా ఆమెకు కిడ్నీ మార్పిడి మరికాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెపుతున్నారు. కాగా తన రెండు కిడ్నీలు పాడయ్యాయనీ, తనను భగవంతుడు కృష్ణుడే రక్షించాలని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.