1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2017 (15:37 IST)

బలపరీక్షలో నెగ్గిన పళనిస్వామి ప్రభుత్వం.. మద్దతుగా 122 ఓట్లు.. వ్యతిరేకంగా 11... విపక్షాలు వాకౌట్

తమిళనాడు అసెంబ్లీ వేదికగా జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రభుత్వం విజయం సాధించింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా

తమిళనాడు అసెంబ్లీ వేదికగా జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రభుత్వం విజయం సాధించింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 11 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో పళనిస్వామి ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గినట్టు స్పీకర్ పి. ధనపాల్ ప్రకటించారు. 
 
అంతకుముందు సభలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనల నేపథ్యంలో.. డీఎంకే సభ్యలందరినీ స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే. దీంతో వారంతా నిరసనకు దిగారు. ఈ నిర్ణయమే పళని స్వామికి కలిసొచ్చింది. డీఎంకే ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో పళని విశ్వాస పరీక్ష నెగ్గడం సులభతరమైంది. ప్రతిపక్ష పార్టీ డీఎంకేలో 89 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరెవరు ఓటింగ్‌లో పాల్గొనలేదు. 
 
పళనికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. కాంగ్రెస్ తరపున ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌ను బహిష్కరించారు. పన్నీర్ తరపున మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఆయన నెగ్గుకురాలేకపోయారు. పళనికి వ్యతిరేకంగా ఆ 11 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు.