గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (13:40 IST)

తల్లితో అక్రమ సంబంధం... కుమర్తెపై లైంగికదాడి.. ఎక్కడ?

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ కామాంధుడు.. ఆమె కుమార్తెపై కూడా లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఊత్తుకోట తాలుకా దేవందవాక్కం గ్రామానికి చెందిన డ్రైవర్‌ చరణ్‌రాజ్‌ శ్రీపెరంబదూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనితో పాటు సత్తరై గ్రామానికి చెందిన కుప్పుస్వామి బస్సు క్లీనర్‌గా పని చేసేవాడు. 
 
ఈ క్రమంలో కుప్పుస్వామి భార్య గోమతితో చరణ్‌రాజ్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. అలాగే కుప్పుస్వామి, గోమతికి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో గోమతి తన 13 ఏండ్ల కుమార్తెతో కలిసి పెద్దకుప్పంలో అద్దె ఇంట్లో చరణ్‌రాజ్‌తో కలిసి కొత్త కాపురం పెట్టింది. 
 
ఇదిలావుంటే, గత నాలుగు నెలల క్రితం గోమతి కుమార్తెకు కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించగా గర్భందాల్చివున్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో బాలికను తల్లి నిలదీయడంతో ఆమె జరిగిన విషయం చెప్పింది. చరణ్ రాజ్ తరచూ బెదిరించి తనపై లైంగికదాడి చేశాడని చెప్పింది. 
 
దీంతో గోమతి తిరువళ్లూరు మహిళా పోలీసు స్టేషన్‌లో నాలుగు నెలల కింద ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్‌రాజ్ పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. అతనికోసం పోలీసులు గాలిస్తుండగా తాజాగా పోలీసులకు చిక్కాడు. దీంతో ఆయన్ను తిరువళ్లూరు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు