ఆ వీడియోలు పెడితే ఇక అరెస్టే...!
ఉదయం లేచినప్పటి నుంచి వీడియో తీసి టిక్ టాక్‌లో పెట్టడం అలవాటైపోయింది. యువతీయువకులు సినిమా పాటలతో హోరెత్తిస్తూ టిక్ టాక్‌లో వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. సరదాగా చేసే వీడియోలు ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితులుగా మారుతున్నాయి.
అందుకే తమిళనాడులో ప్రభుత్వం టిక్ టాక్ వీడియోలు అప్‌లోడ్ చేస్తే అరెస్టు చేయడానికి సిద్థమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 250కు పైగా కేసులు పెట్టి కొంతమందిని అరెస్టు చేశారు. మరికొంతమందిని హెచ్చరించి పంపేశారు. టిక్ టాక్ వ్యవహారం కేసుల వరకు వెళ్ళడానికి ఒక కారణముంది.
కోయంబత్తూరులో ఒక యువకుడు దొంగతనం కేసులో అరెస్టయి ఆ తరువాత విడుదలై పోలీస్టేషన్ నుంచి బయటకు వస్తూ స్టేషన్ ముందే నన్ను ఎవరూ ఏం చేయలేరంటూ టిక్ టాక్‌లో వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఇది కాస్తా తమిళనాడు డిజిపి చూశారు. ఆ యువకుడిని అరెస్టు చేయమని ఆదేశాలిచ్చారు. అంతేకాదు ఎవరైనా వీడియోలు పెడితే అరెస్టు చేయమని ఆదేశాలిచ్చారు. దీంతో తమిళనాడులో టిక్ టాక్ వీడియోలు పెట్టాలంటేనే వణికిపోతున్నారు.