శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (14:56 IST)

ప్రియురాలి రిసెప్షన్‌కు వచ్చి వధువుతో పరార్.. పెళ్ళికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది?

తాళికట్టే సమయానికి పెళ్లాగిపోయింది. అంతే పెళ్లికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి దగ్గర ఉన్న చిన్న పల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి తురైయూరులోని కూరగాయల వ

తాళికట్టే సమయానికి పెళ్లాగిపోయింది. అంతే పెళ్లికొచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి దగ్గర ఉన్న చిన్న పల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి తురైయూరులోని కూరగాయల వ్యాపారం చేసుకునే వెంకటేశన్‌‍కు.. మన్నసనల్లూరుకు చెందిన కన్యతో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
 
కానీ వరుడు తాళికట్టబోయే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పెళ్లికూతురు మైనర్ కావడంతో.. 18ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే తల్లిదండ్రులు జైలుకెళ్లాల్సి వుంటుందని హెచ్చరించారు. అంతే పెళ్లాగిపోయింది. 
 
అయితే కొద్ది రోజులు ఆగి మళ్ళీ పెళ్ళి చేసుకుందామని వెంకటేశన్, వారి బంధువులు అనుకోలేదు. అదే వేదికపై వివాహం జరిపించాలనుకున్న వరుడు తరపు బంధువులు పెళ్ళికొచ్చిన అమ్మాయిల్లో వధువు కోసం వెతికి.. చివరికి వెంకటేశన్ దూరపు బంధువు కుమార్తెను ఎంపిక చేసి వారికి పెళ్ళి చేసేశారు. 
 
మరోవైపు వివాహ రిసెప్షన్‌కు వచ్చి.. వధువుతో ఓ యువకుడు పరారైన ఘటన కూడా తమిళనాడులోని వేలూరులో జరిగింది. తన ప్రియురాలి వివాహ రిసెప్షన్‌కు వచ్చిన ఓ యువకుడు బహుమతి ఇచ్చి.. సమయం చూసుకుని వధువుతో కలిసి ఉడాయించాడు. వివరాల్లోకి వెళితే.. వేలూరు తిరువలానికి చెందిన యురేసియా (24)చెన్నైలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. 
 
ఆమె గతంలో భెల్ సంస్థలో ఉద్యోగం చేస్తోన్న వెంకటేశన్ (25)ను ప్రేమించింది. వీరి ప్రేమకు యురేసియా కుటుంబీకులు అంగీకరించకపోవడంతో పాటు వేరొకరితో వివాహం నిశ్చయించారు. గురువారం వివాహం జరగాల్సి వుండగా, బుధవారం రాత్రి జరిగిన రిసెప్షన్‌కు వచ్చిన వెంకటేశన్ ప్రియురాలితో జంప్ అయ్యాడు.