బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (09:40 IST)

సంద్రమైన చెన్నై... స్తంభించిన జనజీవనం.. పాఠశాలలు బంద్ (Video)

తమిళనాడు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాలుగో రోజు కూడా విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రస్తుతం చెన్నై నగరంతోపాటు ఆయా ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా భారీగా వర్షాల

తమిళనాడు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాలుగో రోజు కూడా విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రస్తుతం చెన్నై నగరంతోపాటు ఆయా ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం పూర్తిగా స్థంభించి పోయింది. అలాగే కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో వీధులన్నీ జలమయమై పల్లపు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇదిలావుండగా మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఈశాన్య రుతుపవనాలతో పాటు... అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను చెన్నై నగర పాలక సంస్థ వేగవంతం చేసింది. బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి… వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు.