సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (16:54 IST)

''మెర్సల్‌''కు రాహుల్ గాంధీ, రజనీకాంత్ మద్దతు: రాహుల్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్స్

''మెర్సల్‌'' సినిమాకు రాజకీయ రంగు పులుపుకుంది. బీజేపీ ఇప్పటికే ఈ సినిమా డైలాగులపై మండిపడుతుంటే.. ఈ సినిమాకు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తోందిం. కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా నటించిన మెర్సల్‌కు మద్దతుగా ఏకంగ

''మెర్సల్‌'' సినిమాకు రాజకీయ రంగు పులుపుకుంది. బీజేపీ ఇప్పటికే ఈ సినిమా డైలాగులపై మండిపడుతుంటే.. ఈ సినిమాకు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తోందిం. కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా నటించిన మెర్సల్‌కు మద్దతుగా ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ‘మెర్సల్’కు అనుకూలంగా ట్వీట్ ఇచ్చారు. తమిళుల ఆత్మ గౌరవాన్ని రద్దు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. 
 
అంతటితో ఆగకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. 'మిస్టర్ మోదీ! సినిమా అనేది తమిళ సంస్కృతి, భాషల పరిపూర్ణ వ్యక్తీకరణ. ''మెర్సల్"లో జోక్యం చేసుకుని తమిళుల ఆత్మగౌరవాన్ని రద్దు చేసే ప్రయత్నం చేయవద్దు'' అని పేర్కొన్నారు. అయితే ఇందు సర్కార్ నిర్మాత మధుర్ భండార్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను దుయ్యబట్టారు. 
 
దేశంలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో తాను నిర్మించిన చిత్రం విషయంలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇదిలా వుంటే నెటిజన్లు కూడా రాహుల్‌ గాంధీని ఎద్దేవా చేస్తున్నారు. కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’పై కాంగ్రెస్ మద్దతుదారులు ఎందుకు దాడి చేశారని ప్రశ్నిస్తున్నారు.
 
మరోవైపు బీజేపీ నేతల జోక్యంతో వివాదంలో చిక్కుకున్న తమిళ చిత్రం మెర్సల్‌కు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మద్దతుగా నిలిచారు. ''శభాష్‌.. ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. మెర్సల్‌ చిత్ర బృందానికి నా అభినందనలు'' అని ట్వీట్‌ చేశారు. వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై మెర్సల్‌ చిత్రంలో ఉన్న సంభాషణలపై తమిళనాడు బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా, రాష్ట్ర అధ్యక్షుడు సౌందరరాజన్, కేంద్ర మంత్రి రాధాకృష్ణన్‌లు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.