ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 23 అక్టోబరు 2017 (12:48 IST)

కొంచెమే టచ్ చేశా... 'అదిరింది' అంటున్న 'మెర్సల్' విజయేంద్రప్రసాద్

బాహుబలి, భజరంగీ భాయీజాన్ చిత్రాల హిట్లతో ఒక్కసారిగా కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు మరోసారి తన కథ పవర్ ఏమిటో చూపించారు ప్రసాద్. విజయ్ హీరోగా ఇటీవలే విడుదలైన మెర్సల్ చిత్రానికి కథ అందించింది ఆయనే. భాజపాకు కొరుక

బాహుబలి, భజరంగీ భాయీజాన్ చిత్రాల హిట్లతో ఒక్కసారిగా కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు మరోసారి తన కథ పవర్ ఏమిటో చూపించారు ప్రసాద్. విజయ్ హీరోగా ఇటీవలే విడుదలైన మెర్సల్ చిత్రానికి కథ అందించింది ఆయనే. భాజపాకు కొరుకుడు పడని జీఎస్టీ గురించి ప్రశ్నించింది ఆయనే. కథలో వున్న పాయింట్ ఇలా హైలెటై హీరో విజయ్ చిత్రానికి అమాంతం క్రేజును పెంచేసింది. ఇకపోతే ఈ చిత్రంపై రగులుతున్న వివాదాలు చిత్ర విజయానికి దోహదపడుతాయని విజయేంద్రప్రసాద్ అన్నారు. 
 
ప్రస్తుతం ఆయన పలువురు హీరోలకు కథలను అందిస్తున్నారు. కంగనా రనౌత్ నటిస్తున్న మణికర్ణిక, ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడిని అస్సాంకు చెందిన రచిత్ కుల్ భౌహిత్ ఆధారంగా ఓ కథ, ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ గోవాల్కర్ జీవిత చరిత్ర, రౌడీ రాథోడ్ సీక్వెల్, ఒకే ఒక్కడు చిత్రానికి సీక్వెల్ చిత్రాలకు కథలు రాస్తున్నట్లు చెప్పారు. ఐతే రాజమౌళికి మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి కథ తయారు చేయలేదనీ, ఆయనకు చెప్పిన పాయింట్ నచ్చితేనే తర్వాత కథకు వెళ్తానని చెప్పుకొచ్చారు.