శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (15:19 IST)

తల్లితో పడక సుఖం పంచుకునే వ్యక్తిని పెళ్లి చేసుకోనంది.. అంతే గొంతుకోసేశాడు..!

చెన్నైలో ఓ తల్లి తన సుఖం కోసం కన్నకూతురును బలి పశువు చేసింది. భర్తకు దూరమై.. అక్రమ సంబంధం ఏర్పరుచుకున్న సదరు మహిళ.. తన ప్రియుడికే కన్నబిడ్డనిచ్చి పెళ్లి చేయాలనుకుంది. అందుకు కుమార్తె నిరాకరించింది. కా

మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆధునికత పేరుతో పాశ్చాత్య సంస్కృతి దేశంలో తాండవం చేస్తోంది. వావివరుసలు లేకుండా అత్యాచారాలు, వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి.

తాజాగా చెన్నైలో ఓ తల్లి తన సుఖం కోసం కన్నకూతురును బలి పశువు చేసింది. భర్తకు దూరమై.. అక్రమ సంబంధం ఏర్పరుచుకున్న సదరు మహిళ.. తన ప్రియుడికే కన్నబిడ్డనిచ్చి పెళ్లి చేయాలనుకుంది. అందుకు కుమార్తె నిరాకరించింది. కానీ ప్రియుడు మాత్రం కూతురు వరసయ్యే యువతి గొంతుకోశాడు. ప్రస్తుతం యువతి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చెన్నై దురైపాక్కం సమీపంలో సుమతీ అనే మహిళ భర్తతో ఏర్పడిన విబేధాల కారణంగా తన 20 ఏళ్ల కుమార్తె ఇందుమతితో విడిగా వుంటుంది. ఈ నేపథ్యంలో దురైపాక్కంకు చెందిన 37 ఏళ్ల సత్యనారాయణతో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది.

దీన్ని ఇందుమతి ఖండించింది. అయినా సుమతి ప్రవర్తన మారలేదు. పెళ్లికాని సత్యనారాయణన్ రాత్రిపూట సుమతి ఇంటికి వచ్చి వెళ్తుండటం అలవాటు. ఆ సమయంలో నిద్రపోతున్న ఇందుమతి వద్ద అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీన్ని సుమతి ఖండించింది. 
 
అయితే సత్యనారాయణన్ మాత్రం ఇందుమతిని తనకిచ్చి పెళ్లి చేస్తే.. ముగ్గురం ఒకే ఇంట్లో సంతోషంగా ఉండొచ్చునని చెప్పాడు. అందుకు సుమతి కూడా అంగీకరించింది. కానీ ఇందుమంతి ఇందుకు నిరాకరించింది. తల్లితో పడక సుఖం పంచుకునేందుకు ఇష్టం లేదని చెప్పేసింది.

దీంతో ఆవేశానికి గురైన సత్యనారాయణన్ గురువారం ఇందుమతి చదివే కాలేజీ వద్దకు వెళ్లాడు. ఆమెను పెళ్ళి చేసుకోవాలని బలవంతం చేశాడు. అందుకు ఇందుమతి అంగీకరించకపోవడంతో కత్తితో గొంతుకోసి పారిపోయాడు. ఆపై పోలీసులు ఇందుమతి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.